త్వరలో హెచ్‌సీఎల్‌లో 15,000 మంది భర్తీ

July 22, 2020
img

 ప్రముఖ ఐ‌టి కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్ డిగ్రీ పూర్తి చేసుకోబోతున్న ఇంజనీరింగ్ విద్యార్దులకు ఓ శుభవార్త చెప్పింది. త్వరలోనే దేశవ్యాప్తంగా 15,000 మందిని తమ కంపెనీలో నియమించుకోబోతున్నట్లు ప్రకటించింది. కరోనా కారణంగా ఇంజనీరింగ్ కాలేజీలు కూడా మూతపడటంతో వర్చువల్ విధానంలో సెలక్షన్ ప్రక్రియ చేపడతామని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్ హెచ్ఆర్‌ హెడ్ వివి అప్పారావు తెలిపారు. కరోనా... లాక్‌డౌన్‌ ప్రభావం ఐ‌టి సాఫ్ట్‌వేర్‌ రంగంపై కూడా చాలా తీవ్రంగా ఉన్నప్పటికీ జూన్‌కు 2020 త్రైమాసికంలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్ నికరలాభం 31.70 శాతం పెరగడంతో రూ.2,925 కోట్లు లాభాలు ఆర్జించింది. కనుక ప్రతికూల పరిస్థితులలో కూడా డిమాండ్, లాభదాయకత రెండూ ఉన్నందున భారీగా కొత్తవారిని నియమించుకోవాలని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్ నిర్ణయించుకొంది. కనుక ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్దులు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్ ఉద్యోగ ప్రకటన కోసం సిద్దంగా ఉండవచ్చు.   


Related Post