మొన్న విద్యార్దులు..నేడు ఉపాధ్యాయులు

March 13, 2020
img

వివిద వర్గాల ప్రజలు లేదా రాజకీయపార్టీలు ఏదో ఒక అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చేందుకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ‘ఛలో అసెంబ్లీ’ పేరిట అసెంబ్లీ వద్ద ధర్నాలు చేస్తుంటాయి. రాష్ట్రంలో యూనివర్సిటీలకు వీసీల నియామకం, ఉపాధ్యాయుల భర్తీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల చెల్లింపుల కోసం రెండు రోజుల క్రితం ఏబీవీపీ విద్యార్దులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించగా, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇవాళ్ళ ఉపాధ్యాయులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించే ప్రయత్నంలో ఇరువర్గాలకు మద్య తోపులాటలు జరిగాయి. ఉపాద్యాయులమైన తమ పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించడాన్ని వారు తప్పు పట్టారు. 

విద్యార్దులు, ఉపాధ్యాయులు లేదా వేరెవరైనా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలనుకోవడం తప్పు కాదు. అలాగే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు శాంతిభద్రతలు కాపాడవలసిన బాధ్యత ప్రజలపైనే ఉంటుంది కనుక వారినీ తప్పు పట్టలేము. కనుక ఇటువంటి సమస్యలు తలెత్తకూడదనుకుంటే జిల్లా కలక్టర్లు, మంత్రులు, ప్రజాప్రతినిధులే ప్రజాసమస్యలను తెలుసుకొని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నించడం మేలు. 

Related Post