ఇంటర్ విద్యార్దులకు లాస్ట్ ఛాన్స్

December 14, 2019
img

ఇంటర్ పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్దులకు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డ్ ఒక ముఖ్య సూచన చేసింది. విద్యార్దులు అందరూ తమ పేరు, తండ్రిపేరు, చిరునామా, గ్రూప్, మీడియం, సబ్జెక్ట్, కట్టిన ఫీజు వగైరా అన్ని వివరాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో స్వయంగా పరిశీలించుకొని ఏవైనా తప్పులు ఉన్నట్లయితే వెంటనే తాము చదువుతున్న కళాశాల ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్లాలని సూచించింది. అప్పుడు ప్రిన్సిపల్ తనపై అధికారులకు తెలియజేసి ఇప్పుడే వాటిని సరిచేయించగలరని ఇంటర్ బోర్డు తెలియజేసింది. 

గత ఏడాది ఇంటర్ పరీక్షలలో ఇటువంటి చిన్న చిన్న పొరపాట్ల వలన ఇంటర్ పరీక్షలలో చాలా గందరగోళం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈసారి అటువంటి పొరపాట్లు పునరావృతం కాకుండా ఇంటర్ బోర్డు చాలా జాగ్రత్తలు తీసుకొంటోంది. విద్యార్దుల వివరాలలో తప్పులు దొర్లిన్నట్లయితే ఇప్పుడే వాటిని సరిచేయించుకోకపోతే, ఆ తరువాత హాల్ టికెట్స్, మార్క్స్ లిస్టులు, సర్టిఫికేట్‌లలో కూడా అవే తప్పులు దొర్లే ప్రమాదం ఉంటుంది. అప్పుడు వాటిని సరిదిద్దించుకోవడం చాలా కష్టం అవుతుంది. కనుక ఇంటర్ విద్యార్దులు, వారి తల్లితండ్రులు ఈ ఆఖరి అవకాశాన్ని వినియోగించుకొని ఇప్పుడు వివరాలను సరిచూసుకొంటే మంచిది.

Related Post