ప్రగతి భవన్‌ ముట్టడికి ప్రయత్నించిన టీఆర్టీ అభ్యర్ధులు

October 16, 2019
img

బుదవారం మధ్యాహ్నం టీఆర్టీ అభ్యర్ధులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రగతి భవన్‌ ముట్టడికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకొన్నారు. ఆ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్తవాతావరణం నెలకొంది. పోలీసులు వారిని వ్యాన్లలో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రెండేళ్ళ క్రితం పరీక్షలు వ్రాసి ఉత్తీర్ణులమైన తమకు ఇంతవరకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వోద్యోగాలకి ఎంపిక అయినందున వాటిలో జేరేందుకు రెండేళ్లుగా ఎదురుచూపులు చూస్తున్నామని, ఆకారణంగా తమ కుటుంబ ఆర్ధికపరిస్థితి ఛిన్నాభిన్నం అవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని పరీక్షలలో ఉత్తీర్ణులైనప్పటికీ ప్రభుత్వోద్యోగాలలో చేరలేక, వాటికి ఎంపికైన కారణంగా ప్రైవేట్ ఉద్యోగాలు లభించక చాలా మానసిక క్షోభ అనుభవిస్తున్నామని, ఇకనైనా సిఎం కేసీఆర్‌ కలుగజేసుకొని తమకు నియామకపత్రాలు అందజేసి తక్షణం ఉద్యోగాలలో చేర్చుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. టీఆర్టీ అభ్యర్ధులు రోడ్లపై బైటాయించి ధర్నాలు చేయడంతో చాలాసేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది.

Related Post