నిరుద్యోగులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ

May 10, 2019
img

ఉచిత కంప్యూటర్ శిక్షణ పేరుతో రోజూ పేపర్లలో ప్రకటనలు వస్తుంటాయి. కానీ వాటిలో చాలా వరకు మోసపూరితమైనవే ఉంటున్నాయి. ఉచిత శిక్షణ అని చెపుతూనే మళ్ళీ ఏదో పేరుతో ఫీజులు వసూలు చేస్తుంటాయి. నిరుద్యోగులు ఎదుర్కొంటున్న ఈ సమస్యను గుర్తించిన అప్సా-టెక్ మహీంద్రా, ఫౌండేషన్ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇస్తోంది. మూడు నెలలపాటు సాగే ఈ శిక్షణా కార్యక్రమాలలో నిరుద్యోగులకు కంప్యూటర్ బేసిక్స్, ఇంటర్నెట్ కాన్స్పెట్, ఇంగ్లీషులో మాట్లాడటం, టైపింగ్ వంటివి ఆయా రంగాలలో నిపుణుల చేత ఉచితంగా నేర్పిస్తారు.

ఈ శిక్షణ పొందడానికి కనీస విద్యార్హత 10వ తరగతి పాసై ఉండాలి. ఇంటర్మీడియట్‌ పాస్ లేదా ఫెయిల్ అయినవారు, 18-27 సం.ల మద్య వయసున్న యువతీ యువకులు ఈ ఉచిత శిక్షణకు అర్హులు. ఆసక్తిగలవారు ముషీరాబాద్ చౌరస్తా వద్ద గల ఆప్సా-టెక్ మహీంద్రా ఫౌండేషన్ స్మార్ట్ టెక్నికల్ ట్రెయినింగ్ సెంటరులో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ శిక్షణకు సంబందించి పూర్తి వివరాల కోసం 99490 25230, 84980 89786 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు. 

ఈరోజుల్లో ఏ ఆఫీసులో పనిచేయాలన్నా కంప్యూటరుపై పనిచేయడం, ఇంగ్లీషులో సమాధానం చెప్పగలిగే నేర్పు చాలా అవసరం. ఇదే శిక్షణ బయట ప్రైవేట్ ఇన్స్టిట్యూటులలో నేర్చుకోవాలంటే వేలరూపాయలు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. కనుక ఆప్సా-టెక్ మహీంద్రా ఫౌండేషన్ అందిస్తున్న ఈ గొప్ప అవకాశాన్ని నిరుద్యోగులు ఉపయోగించుకొంటే వారి ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి.

Related Post