ముస్లిం మహిళలకు సౌదీలో ఉద్యోగాలు

February 02, 2019
img

సౌదీ అరేబియాలోని కింగ్ ఫైసల్ మిలటరీ సిటీలో క్లీనింగ్ పనులు చేయడానికి 10 మంది ముస్లిం మహిళలు అవసరముందని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ (రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ) ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. ఆసక్తిగల మహిళలు తమ ఈసీఆర్‌, ఈసీఎన్‌ఆర్‌ పాస్ పోర్ట్ తదితర దృవీకరణపత్రాలతో ఈనెల 4వ తేదీన హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఐటీఐ, మల్లేపల్లి, విజయనగర్‌ కాలనీలో తమ కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూకు హాజరుకావచ్చని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కెవై నాయక్ తెలిపారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.25,000-30,000 వరకు జీతం, ఉచిత వసతి, భోజన, రవాణా సౌకర్యాలు కల్పించబడుతాయని తెలిపారు. ఈ ఉద్యోగాలకు సంబందించి పూర్తి వివరాల కావాలనుకుంటే 7997973358 అనే ఈ ఫోన్‌ నెంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చునని నాయక్ తెలిపారు. ఇంటర్వ్యూలకు కేవలం రెండు రోజులు సమయం మాత్రమే ఉంది కనుక ఆసక్తి, అవసరం ఉన్న ముస్లిం మహిళలకు ఈవిషయం తెలియజేయాలని అందరికీ విజ్ఞప్తి.    


Related Post