విదేశీ విద్యాభ్యాసానికి స్కాలర్ షిప్పులు కావాలా?

January 30, 2019
img

విదేశాలలో ఉన్నతవిద్యలభ్యసించాలనుకొంటున్న పేదవిద్యార్ధులకు తెలంగాణ ముఖ్యమంత్రి విదేశీ విద్యా పథకం క్రింద రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్ షిప్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఫాల్-2018 సీజన్‌లో భాగంగా హైదరాబాద్‌లో నివసిస్తున్న మైనారిటీ వర్గాలవారికి, క్రిస్టియన్‌, సిక్కు, బౌద్ధ, జైన్‌, పార్శీ, జొర్దానియన్‌ మతాలకు చెందిన విద్యార్ధుల నుంచి స్కాలర్ షిప్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి మహమ్మద్ ఖాసీం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. 

విదేశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టరేట్ తదితర కోర్సులకు ఈ స్కాలర్ షిప్ లభిస్తాయని తెలిపారు. విదేశీ యూనివర్శిటీలలో 2018, ఆగస్టు1 నుంచి 2018,డిసెంబర్‌ 31 లోపల ప్రవేశం పొందినవారు మాత్రమే వీటికి అర్హులని తెలిపారు. కనుక ఈ అర్హతలున్న విద్యార్ధులు ఫిబ్రవరి 20వ తేదీ సాయంత్రం 5గంటల లోపుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని కోరారు.

దీనికి సంబందించి పూర్తి వివరాల కొరకు www.telanganaepass.cgg.gov.in అనే వెబ్ సైట్ ను సందర్శించవచ్చు లేదా నాంపల్లి వద్దగల హజ్‌హౌస్‌ 6వ అంతస్తులోగల జిల్లా మైనారిటీ వెల్ఫేర్‌ అధికారి కార్యాలయంలో రూమ్‌ నెంబర్: 601 నుంచి వివరాలను, సబందిత పత్రాలను పొందవచ్చునని తెలిపారు. ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకోగోరేవారు 040 23240134 నెంబరులో సంప్రదించవచ్చని తెలియజేశారు.

Related Post