కాళోజీ యూనివర్సిటీలో పారా-మెడికల్ కోర్సులు

August 10, 2018
img

వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సస్ లో పారా-మెడికల్ కోర్సులలో ప్రవేశానికి విద్యార్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. బిఎస్సి నర్సింగ్ (నాలుగేళ్ళ డిప్లమా కోర్సు), పిబిబిఎస్సీ నర్సింగ్ (రెండేళ్ళ కోర్సు), బిపిటి, బిఎస్సీ (ఎంఎల్టి) కోర్సులలో ప్రవేశాలకు ఈ నెల 11 నుంచి 30లోగా దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. 

సాధారణంగా చాలా మంది విద్యార్ధులు మంచి ఉద్యోగాలు లభిస్తాయనే ఉద్దేశ్యంతో ఇంజనీరింగ్, ఐటి రంగాలను ఎంచుకొంటారు. కానీ అందరూ వాటిలోనే ప్రవేశిస్తుండటంతో ఆ రంగంలో పోటీ పెరిగిపోతోంది. అనేక కారణాల వలన ఉద్యోగావకాశాలు కూడా నానాటికీ తగ్గిపోతున్నాయి. అందుకే బి-టెక్ చేసిన విద్యార్ధులు పోలీస్ కానిస్టేబుల్, హోం గార్డు ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవలసివస్తోంది. కానీ పారా-మెడికల్ కోర్సులలో శిక్షణ పొందినవారికి ఎల్లప్పుడూ ఉద్యోగావకాశాలు ఉంటూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పారా-మెడికల్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగాలు దొరకకపోతే ప్రైవేట్ రంగంలో అనేక అవకాశాలు ఉంటాయి. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా పారా-మెడికల్ ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే దేశ విదేశాలలో కూడా పారా-మెడికల్ కోర్సులు చేసినవారికి ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నాలుగేళ్ళ ఇంజనీరింగ్ విద్యతో పోలిస్తే పారా-మెడికల్ కోర్సులు తక్కువ ఖర్చుతో పూర్తవుతాయి. కనుక విద్యార్ధులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ రంగంలో ప్రవేశిస్తే మంచిది.

Related Post