బాషాపండిట్ లకు త్వరలో పదోన్నతి?

August 02, 2018
img




రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలలో తెలుగు, హిందీ, ఉర్దూ బాషలను భోదిస్తున్న బాషా పండిట్ ఉపాధ్యాయులకు త్వరలో స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్స్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారికి సంబంధించిన ఫైలును వెంటనే పంపించవలసిందిగా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి రంజీవ్ ఆచార్యను కోరారు. 

బాషా పండిట్ ఉపాధ్యాయులు ఇంతవరకు సెకండరీ గ్రేడ్ టీచర్లుగానే పనిచేస్తున్నారు. వారికి స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ కల్పించదానికి రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాదిఫిబ్రవరిలో జీవో:17,18లను జారీ చేసింది. కానీ దానిపై సెకండరీ గ్రేడ్ టీచర్లు హైకోర్టులో కేసు వేయడంతో వారి ప్రమోషన్లు నిలిచిపోయాయి. అయితే గత ఏడాది డిసెంబరులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో బాషా పండిట్ ఉపాధ్యాయుల సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తానని సిఎం కెసిఆర్ హామీ ఇచ్చారు. ఇప్పుడు వారి సమస్యపై దృష్టి పెట్టాలని నిర్ణయించి వారి ప్రమోషన్లకు సంబందించిన ఫైలును తన కార్యాలయానికి పంపించవలసిందిగా అధికారులను ఆదేశించడంతో బాషా పండిట్ ఉపాధ్యాయులలో మళ్ళీ ఆశలు చిగురించాయి. త్వరలోనే సిఎం కెసిఆర్ దీనిపై నిర్ణయం తీసుకొంటారని 2,487 మంది ఉపాద్యాయులు ఆశగా ఎదురుచూస్తున్నారు.      


Related Post