ఎస్సై వద్దు.. కానిస్టేబుల్ ఉద్యోగమే ముద్దు

June 21, 2018
img

తెలంగాణా పోలీస్ శాఖలో 18,428 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించగా మొత్తం 1.75 లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారు. విశేషమేమిటంటే వారిలో 1.20 లక్షలమంది కానిస్టేబుల్ ఉద్యోగాలకే దరఖాస్తు చేసుకున్నారు. వారిలో పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉండటం విశేషం. వారు ఎస్సై ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు అర్హులైనప్పటికీ కానిస్టేబుల్ ఉద్యోగాలకే దరఖాస్తు చేసుకోవడం విశేషం. 739 ఎస్సై పోస్టులకు సుమారు 50,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా జూన్ 30వ తేదీ వరకు ఆన్-లైన్ దరఖాస్తులు స్వీకరించబడతాయి. కనుక ఈ అవకాశాన్ని నిరుద్యోగులు అందరూ వినియోగించుకుంటే మంచిది. భర్తీ చేయబోతున్న ఉద్యోగాల వివరాలు: 

 1. కానిస్టేబుల్స్: 16,767 

2. ఎస్సైలు: 739 

3. ఆర్.ఎస్.ఐ.లు: 471

4.  వార్డెన్స్: 221 

5. ఫైర్ మ్యాన్: 168

6. ఏ.ఎస్.ఐ: 26

7. స్టేషన్ ఫైర్ ఆఫీసర్: 19 

8. డిప్యూటీ జైలర్: 15 

9. అసిస్టెంట్ మ్యాట్రన్: 02  పోస్టులు ఉన్నాయి. 

ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలకు తెలంగాణా పోలీస్ రిక్రూట్మెంట్ విభాగానికి చెందిన వెబ్ సైట్ లో చూడవచ్చు. 

Related Post