టి-ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ జారీ

May 25, 2018
img

తెలంగాణా సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ నవీన్ మిట్టల్ ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ జారీ చేశారు. ఆ వివరాలు:

1. రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు: మే 25 నుంచి జూన్ 2వరకు 

2. విద్యార్ధుల సర్టిఫికేట్స్ పరిశీలన: మే 28 నుంచి జూన్ ౩వరకు 

3. మొదటిదశ సీట్ల కేటాయింపు: జూన్ 8

4. సీట్లు పొందిన విద్యార్ధులు ట్యూషన్ ఫీజ్ చెల్లింపుకు సమయం: జూన్ 8 నుంచి 12వరకు

5. ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు ప్రాసెసింగ్ ఫీజు: రూ.600.00

6. ఇతర విద్యార్ధులకు ప్రాసెసింగ్ ఫీజు: 1,200.00

7. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరుగు ప్రాంతం: మాసాబ్ ట్యాంక్ లో సాంకేతిక భవన్ 

విద్యార్ధులకు కొన్ని ముఖ్య సూచనలు: 

విద్యార్ధులు తప్పనిసరిగా తెచ్చుకోవలసిన సర్టిఫికేట్లు: ఎంసెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, ఆధార్ కార్డు, ఎస్.ఎస్.సి. లేదా తత్సమాన సర్టిఫికేట్, మార్కుల జాబితా, ఇంటర్ లేదా తత్సమాన సర్టిఫికేట్, మార్కుల జాబితా, 6వ తరగతి నుంచి ఇంటర్ లేదా తత్సమాన స్టడీ సర్టిఫికేట్లు, టీసి, 1/1/2018 తరువాత జారీ చేయబడిన ఆదాయ, కుల నివాస దృవీకరణ పత్రాలు.

సీట్లు పొందిన విద్యార్ధులు తప్పనిసరిగా జూన్ 8-12లోగా ఫీజు చెల్లించి, ఎంసెట్ కు సంబంధించిన వెబ్ సైట్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయవలసి ఉంటుంది. లేకుంటే సీటు రద్దు అవుతుంది. విద్యార్ధుల అవగాహనా కొరకు వెబ్ సైట్ లో గత ఏడాది కేటగిరీలవారీగా ఇచ్చిన కటాఫ్ మార్కులు, వెబ్ ఆప్షన్లు వగైరా వివరాలు ఉంచబడ్డాయి. వాటి ఆధారంగా విద్యార్ధులు ఆప్షన్లు ఎంచుకోవచ్చు. 

ఆప్షన్లు, కాలేజీ, బ్రాంచి కోడ్ పేర్కొనేటప్పుడు విద్యార్ధులు ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవడం మంచిది.   

Related Post