నీట్, ఎంసెట్ పరీక్షలకు ఉచిత శిక్షణ

April 10, 2018
img

రాష్ట్రంలో ప్రతీ ఏటా లక్షలాదిమంది విద్యార్ధులు ఎంసెట్, నీట్ పోటీ పరీక్షలకు హాజరవుతుంటారు. కానీ కోచింగ్ సెంటర్లకు వేలాది రూపాయలు ఫీజులు చెల్లించుకోలేని ప్రతిభావంతులైన పేద విద్యార్ధులు కూడా ఉంటారు. అటువంటివారి కోసం తెలంగాణా ప్రభుత్వమే ఉచిత శిక్షణ ఇప్పిస్తోంది. రాష్ట్రంలో రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు మోడల్ స్కూల్స్ లో చదివే విద్యార్ధులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖామంత్రి కడియం శ్రీహరి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 26 శిక్షణాకేంద్రాలను ఏర్పాటుచేసి, ఒక్కో డానికి ఒక్కో ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బందిని నియమించామని చెప్పారు. ఒక్కో కేంద్రంపై ప్రభుత్వం రూ.15 లక్షలు ఖర్చు చేస్తోందని మంత్రి తెలిపారు. ఈ 26 శిక్షణాకేంద్రాలలో మొత్తం 3,500 మంది విద్యార్ధులు అత్యున్నత ప్రమాణాలతో కూడిన శిక్షణ పొందుతున్నారని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న ఈ కృషికి మంచి ఫలితాలు కూడా వస్తున్నాయని అందుకు తమకు చాలా సంతోషంగా ఉందని మంత్రి కడియం శ్రీహరి అన్నారు. అర్హులైన విద్యార్ధులందరికీ ఉన్నత విద్యావకాశాలు కల్పించాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యమని మంత్రి అన్నారు.     


Related Post