శేఖర్ కమ్ముల ఏడాదికి ఒకటో రెండో సినిమాలు తీసే టైప్ దర్శకుడు కానేకారు. అలాగే మాస్ మసాలా సినిమాల జోలికి ఎన్నడూ పోయింది లేదు. ప్రతీ సినిమా, కధ విలక్షణం. ప్రతీ పాత్ర, పాట శాశ్వితం అన్నట్లు ఉంటాయి ఆయన సినిమాలు. అలాంటి మరో సినిమాయే ‘కుబేర’ అని ఇప్పటికే స్పష్టమైపోయింది. ట్రైలర్‌తో మరోసారి ధృవీకరించేశారు శేఖర్ కమ్మల.
ట్రైలర్‌లో శేఖర్ కమ్ముల టేకింగ్, నాగార్జున, ధనుష్, రష్మికల అద్భుతమైన నటన, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాతో శేఖర్ కమ్ముల ఖాతాలో మరో సూపర్ హిట్ నమోదు కాబోతోందని ట్రైలర్‌తో స్పష్టం చేస్తోంది.
కుబేరా సినిమాలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన, జిమ్ సరబ్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకి కధ: శేఖర్ కమ్ముల, చైతన్య పింగళి, దర్శకత్వం: శేఖర్ కమ్ముల, సంగీతం: దేవి శ్రీప్రసాద్, కెమెరా: నికేత్ బొమ్మి చేస్తున్నారు.
శ్రీ వేంకటేశ్వర సినిమాస్, ఎల్ఎల్పి అమిగోస్ క్రియెషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కుర్ రాంమోహన్ రావు కలిసి ఈ సినిమాని 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. కుబేర ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.