8 వసంతాలు…. ట్రైలర్‌ వెరీ గుడ్!

June 15, 2025
img

ఫణీంద్ర నర్సెట్టి కధ, దర్శకత్వంలో ‘8 వసంతాలు’ సినిమా ట్రైలర్‌ నేడు విడుదలైంది. ఈ సినిమా టైటిల్‌ చూసినప్పుడు ఇదో మధురమైన ప్రేమ కధ అని అనిపిస్తుంది. ఆ ప్రేమ కధతో పాటు హీరోయిన్‌ అనంతిక సానిల్ కుమార్‌ చేసిన పోరాటాలని కూడా ట్రైలర్‌లో చూపించడంతో ‘8 వసంతాలు’ ఓ భిన్నమైన సినిమా అనిపిస్తుంది. 

తొలి ప్రేమ విఫలం అవడం, హీరోయిన్‌ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ, విలన్‌లతో ఫైటింగ్ వంటివన్నీ ట్రైలర్‌లో చకచకా చూపించారు దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి. కనుక జూన్ 20 న విడుదల కాబోతున్న ‘8 వసంతాలు’ సినిమాపై ట్రైలర్‌ అంచనాలు పెంచిందనే చెప్పవచ్చు. 

ఈ సినిమాలో రవితేజ దుగ్గిరాల, హనురెడ్డి, కన్నా పసునూరి ప్రధాన పాత్రలు చేశారు. ఈ సినిమాకు సంగీతం: హేషమ్‌ అబ్దుల్ వాహిబ్, కెమెరా: విశ్వనాథ్ రెడ్డి, ఎడిటింగ్: శశాంక్ మాలి చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ పోలిశెట్టి ఎర్నేని, వైసీపీ రవిశంకర్ కలిసి ఈ సినిమా నిర్మించారు.      <iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/qX5LwrXIpsM?si=PcGokoYFPqxMdHto" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>  


Related Post