కన్నప్ప ట్రైలర్‌: యాక్షన్ మూవీలా ఉందే!

June 15, 2025
img

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ట్రైలర్‌ శనివారం విడుదలయ్యింది. మనకి తెలిసిన కన్నప్ప అడవులలో నివాసించే ఓ కోయ వీరుడు. శివుడిని రాయనుకునే నాస్తికుడు. చివరికి ఆ పరమ శివుడికి తన కన్ను తీసి ఇచ్చేంత భక్తుడుగా మారి పోతాడు. కనుక ఇది భక్తి ప్రధానమైనది.

అయితే ఇది మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్  కనుక ‘కన్నప్ప’లో ‘వాయు లింగం’ కోసం పోరాటాలంటూ ఓ యాక్షన్ మూవీగా మార్చి మంచి రొమాన్స్, దాంతో పాటు భక్తిని కూడా జోడించినట్లు ట్రైలర్‌ చూస్తే అర్దమవుతుంది. ట్రైలర్‌ చూసి సినిమాని అంచనా వేయడం తొందరపాటే అవుతుంది. యాక్షన్ సన్నివేశాల తర్వాత శివభక్తుడుగా మారిన కన్నప్ప ప్రేక్షకులను మెప్పించగలిగితే సినిమా సూపర్ హిట్ అయినట్లే! 

ఈ సినిమా కోసం మోహన్ బాబు, మంచు విష్ణు చాలా భారీగా ఖర్చు పెట్టారు. ట్రైలర్‌లో ఆ క్వాలిటీ చాలా స్పష్టంగా కనబడుతోంది. రుద్రుడుగా ప్రభాస్‌ ఎంట్రీ, డైలాగ్స్ అభిమానులను పులకింపజేస్తాయి. 

ఈ సినిమాలో కన్నప్పకి జోడీగా నుపూర్ సనన్ నటిస్తోంది. అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ శివపార్వతులుగా, ప్రభాస్‌ రుద్రుడుగా నటిస్తున్నారు. మోహన్ బాబు, బ్రహ్మానందం, శరత్ కుమార్, మోహన్ లాల్ తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

కన్నప్ప సినిమాకు దర్శకత్వం: ముఖేష్ కుమార్‌ సింగ్‌, సంగీతం: స్టీఫెన్ దేవాస్సీ, కెమెరా: షెల్డన్ షావ్, ఆర్ట్: చిన్న, ఎడిటింగ్: ఆంథోనీ చేస్తున్నారు.

అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు, మంచు విష్ణు నిర్మిస్తున్న కన్నప్ప జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.       

Related Post