టాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు అందించడమే కాకుండా హీరో.. హీరోయిన్లకు మంచి లైఫ్ ఇచ్చిన దర్శకులు రాఘవేంద్ర రావు ఈ మద్య సరైన హిట్ లేక కాస్త డీలా పడ్డారు. గతంలో ఆయన పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూనే మరోపక్క తక్కువ బడ్జెట్ సినిమాలు చేసిన రికార్డ్ ఉంది. ఇప్పుడు మరోసారి తన బ్యానర్ లో చిన్న సినిమా చేయాలని చూస్తున్నాడు. బలమైన కథా కథనాలను కలర్ ఫుల్ గా చెప్పడంలోను.. అన్నివర్గాల ఆడియన్స్ ను మెప్పించడంలోను రాఘవేంద్రరావు సిద్ధహస్తులు.
ఎంతోమంది హీరోలకు భారీ విజయాలను అందించారాయన.. మరెంతో మంది హీరోయిన్స్ కి గ్లామర్ పరంగా మంచి క్రేజ్ తీసుకొచ్చారు. తాజాగా ఆయన ఓ మినిమం బడ్జెట్ లో పూర్తి వినోదాత్మక చిత్రాన్ని తెరకెక్కించాలని నిర్ణయానికి వచ్చారట. ఓ మంచి కథను సిద్ధం చేసుకుని.. ఓ యంగ్ హీరోతో సినిమా చేయాలనే ఆలోచనలో ఆయన వున్నారని సమాచారం. అందుకోసం ఆయన కథలు వింటున్నారట. కథ ఓకే అయితే ఆర్కా మీడియా బ్యానర్లో సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు.