వారణాశి ప్రమోషన్స్ అప్పుడే షురూ!

November 18, 2025


img

రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందిస్తున్న ‘వారణాశి’ షూటింగ్ ఇంకా సగం కూడా పూర్తికాలేదు. కానీ టైటిల్‌ గ్లిమ్స్‌తోనే రాజమౌళి చాలా అట్టహాసంగా ప్రమోషన్స్ ప్రారంభించారు. హాలీవుడ్ సినిమాలకు తీసిపోని స్థాయిలో టైటిల్‌ గ్లిమ్స్‌ ఉండటంతో యావత్ ప్రపంచ దేశాల దృష్టి ఆకర్షిస్తోంది.

వారణాశిని అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయడమే కాదు మరోసారి ఆస్కార్ అవార్డు సాధించాలని రాజమౌళి భావిస్తున్నట్లున్నారు. అందుకే ప్రపంచ దేశాలకు చెందిన (అంతర్జాతీయ) మీడియా ప్రతినిధులకు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు.

ఈ కార్యక్రమంలో మహేష్ బాబు, పృద్విరాజ్ సుకుమారాన్, ప్రియాంకా చొప్రా ముగ్గురూ పాల్గొనబోతున్నారని శ్రేయాస్ మీడియా వెల్లడిస్తూ వారి ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టింది. 

ఈ సినిమాలో మందాకినిగా బాలీవుడ్‌ సీనియర్ నటి ప్రియాంకా చొప్రా, విలన్‌గా కుంభగా ప్రముఖ మళయాళ నటుడు పృద్విరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. 

శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ కలిసి నిర్మిస్తున్న వారణాశి 2027 వేసవిలో విడుదల కాబోతోంది. 

ఈ సినిమాకి కధ: విజయేంద్ర ప్రసాద్, దర్శకత్వం:ఎస్ఎస్ రాజమౌళి, డైలాగ్స్: దేవకట్ట, సంగీతం: ఎంఎం కీరవాణి, కెమెరా: ఎస్.గోపాల్ రెడ్డి, పిఎస్ వినోద్, వీఎఫ్ఎక్స్‌: శ్రీనివాస్ మోహన్, సందీప్ కమల్‌, మోహన్ నాథ్ బింగి, ఆర్ట్: సందీప్ సువర్ణ, ఎడిటింగ్: బిక్కిన తమ్మరాజు, స్టంట్స్: కింగ్ సోలోమన్, లైన్ ప్రొడ్యూసర్: ఎంఎం శ్రీవల్లి, కాస్ట్యూమ్స్: రమ రాజమౌళి, ఎస్ఎస్ కార్తికేయ: ప్రొడక్షన్ మేనేజ్ మెంట్ చేస్తున్నారు.                         


Related Post

సినిమా స‌మీక్ష