శివాజీ, బిందు మాధవి, నవ్‌దీప్, మురళీధర్ గౌడ్ ముఖ్యపాత్రలు చేసిన సినిమా ‘దండోరా.’ మురళీకాంత్ దేవసోథ్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా టీజర్ నిన్న విడుదలైంది.
‘చావనేది మనిషికిచ్చే ఆఖరి మర్యాద,’ ‘నాలుగు పుస్తకాలు చదివి లోకమంతా తెలిసినోడి లెక్క మాట్లాడకు...’, అమెరికా పోయినా ఎక్కడకు పోయినా చేస్తే శవాన్ని ఇక్కడికే తేవాలి తప్పదు,’ వంటి డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి.
తెలంగాణ గ్రామీణ నేపధ్యంలో తీస్తున్న ఈ సినిమాకి ‘దండోరా’ అనే పేరు, ఈ డైలాగ్స్ విన్నప్పుడు జీవితం-చావు గురించి లోతైన విషయాలు చెప్పాబోతున్నట్లనిపిస్తుంది. టీజర్, దానిలో నటీనటుల నటన, డైలాగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. కనుక సినిమా ఇంతకు మించే ఉంటుందని భావించవచ్చు.
ఈ సినిమాలో రవికృష్ణ, మణిక, మౌనిక రెడ్డి, రాధ్యా తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: మురళీకాంత్ దేవసోథ్, సంగీతం: మార్క్ కే రాబిన్, కెమెరా: వెంకట్ ఆర్ శాఖమూరి, ఎడిటింగ్: సృజన అడుసుమిల్లి చేశారు.
లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ముప్పనేని శ్రీలక్ష్మి సమర్పణలో రవీంద్ర బెనర్జీ ముప్పనేని డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందు దండోరా వేయబోతున్నారు.