మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్టర్ విడుదల చేసింది.
ఎన్‌బీకే 111 వర్కింగ్ టైటిల్‌తో గాడ్ ఆఫ్ మాసస్ నందమూరి బాలకృష్ణ హీరోగా చేస్తున్న సినిమాలో కూడా నయనతార హీరోయిన్‌గా నటించబోతున్నట్లు దర్శకుడు గోపీచంద్ మలినేని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ‘మహారాణిగారు తన సామ్రాజ్యంలోకి ప్రవేశిస్తున్నారంటూ..’ ఫస్ట్ గ్లిమ్స్ విడుదల చేశారు. గతంలో ఆమె శ్రీ రామ రాజ్యం, సింహా సినిమాలలో బాలయ్యకు జోడీగా నటించారు.
చారిత్రిక నేపధ్యంతో తీస్తున్న ఈ సినిమాని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.