బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో అఖండ 2 డిసెంబర్ 5న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమాను నుంచి జాజికాయ, జాజికాయ అంటూ సాగే రెండో పాటని నేడు విడుదల చేయబోతున్నారు. విశాఖపట్నంలోని జగదాంబ థియేటర్లో మంగళవారం సాయత్రం 6 గంటల నుంచి ఈ పాట లాంచింగ్ ఈవెంట్ మొదలవుతుంది. రాత్రి 7.23 గంటలకు పాట విడుదలవుతుంది.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను, చిత్రబృందం ఈరోజు సాయంత్రం విశాఖపట్నం చేరుకున్నారు. అఖండ-2 ట్రైలర్ ఈ నెల 28న విడుదల చేయబోతున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: బోయపాటి శ్రీను, సంగీతం: థమన్, కెమెరా: సి. రామ్ ప్రసాద్, సంతోష్ డి డెటాకె, ఎడిటింగ్: తమ్మిరాజు చేశారు.
14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై ఎమ్మెల్యేలు.తేజస్విని నందమూరి, రామ్ ఆచంట, గోపీ అచంతలతో కలిసి పాన్ ఇండియా మూవీగా అఖండ-2 నిర్మించారు.