బిగ్ బాస్ తెలుగు సీజన్-8 నేటి నుంచే... ఇదిగో ప్రమో!

September 07, 2025


img

నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్-9 నేడు (ఆదివారం) సాయంత్రం 7 గంటలకు 'స్టార్ మా'  మా ఛానల్లో ప్రారంభం కాబోతోంది. ఈ సందర్భంగా బిగ్ బాస్ ప్రమో విడుదల శారు.

ఈసారి కూడా ఎప్పటిలాగే పలువురు సెలబ్రిటీలు, సామాన్యులు ఈషోలో పాల్గొనబోతున్నారు. ప్రమోలో వారి గొంతుతో డైలాగులు వినిపించారు కానీ వారు ఎవరో చూపించలేదు. ఇ

ఓ కంటెస్టెంట్ తన కుటుంబ సభ్యులు ఇచ్చిన చిన్న బహుమతితో హౌసులోకి వెళ్ళాలనుకుంటాడు. కానీ బిగ్ బాస్ కుదరదని చెప్పడమే కాకుండా ఈ షోలో పాల్గొనడానికి వీల్లేదని తిప్పి పంపించేసి అందరికీ షాక్ ఇస్తాడు. కనుక ఈసారి బిగ్ బాస్ షో మరింత కటినంగా సాగబోతోందని స్పష్టమవుతుంది. 

ప్రమోలో నాగార్జున బిగ్ బాస్ హౌస్ సెట్ చూపించారు. అది చాలా అద్భుతంగా ఉంది. ఈసారి మొత్తం 14 మంది ఈ షోలో పాల్గొనబోతున్నారు.వారిలో 9 మంది నేరుగా లోనికి వెళ్తే ఈ షోలో పాల్గొనేందుకు వచ్చిన వారికి కొన్ని పరీక్షలు పెట్టి వాటిలో విజయం సాధించిన ఐదుగురిని హౌసులోకి పంపించబోతున్నారు. 

బిగ్ బాస్ హౌసులోకి వెళుతున్న సెలబ్రెటీలు, సామాన్యులు వీరే.. సంజన గల్రాని, ఆశా షైనీ, జబర్దస్త్ ఇమ్మానుయెల్, తనూజ, రీతూ చౌదరి, రాను బొంబాయికి రాను... అంటూ సాగే సూపర్ హిట్ పాటకు డాన్స్ చేసిన రాము రాథోడ్,  శ్రష్టి వర్మ, భరణి శంకర్, సుమన్ శెట్టి, ప్రియ శెట్టి, మాస్క్ మ్యాన్ హరీష్, మర్యాద మనీష్, శ్రీజ తదితరులు ఉంటారని సమాచారం.     


Related Post

సినిమా స‌మీక్ష