కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితుడే. బిచ్చగాడు వంటి విభిన్నమైన సినిమాలతో అందరినీ మెప్పించారు. ఆయన 25వ సినిమాగా రూపొందిన ‘భద్రకాళి’ అనివార్య కారాణాల వలన ఒకటి రెండుసార్లు వాయిదా పడినప్పటికీ ఎట్టకేలకు ఈ నెల 19న విడుదల కాబోతోంది.
కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు అరుణ్ ప్రభు పురుషోత్తమన్ దర్శకత్వంలో సిద్దమైన ఈ సినిమాలో వాగై చంద్రశేఖర్, త్రుప్తి రవీంద్ర, కిరణ్, రియా జితు తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
సర్వాంత్ రామ్ చరణ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజి నిర్మాణంలో వస్తున్న ఈ భద్రకాళి తెలుగు వెర్షన్ ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ విడుదల చేస్తోంది. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా కూడా ఈ సినిమాలో భాగస్వామిగా ఉండటం వలన దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
విజయ్ ఆంటోనీ మంచి సంగీత దర్శకుడని తెలిసిందే. కనుక ఈ సినిమాకు ఆయన స్వయంగా సంగీతం అందించిన నటించారు.