విజయ్ దేవరకొండ కింగ్‌డమ్‌ రిలీజ్‌ వాయిదా

May 14, 2025


img

విజయ్ దేవరకొండ-గౌతమ్‌ తిన్ననూరి కాంబినేషన్‌లో ‘కింగ్‌డమ్‌’ సినిమా ఈనెల 30 న విడుదల కావలసి ఉండగా వాయిదా పడింది. ఆపరేషన్ సింధూర్‌ తదనంతర పరిణామాల తర్వాత దేశంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కింగ్‌డమ్‌ సినిమాని జూలై 4వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈరోజు సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు తెలియజేసింది. 

ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి జోడీగా భాగ్యశ్రీ భోరే నటిస్తోంది. రుక్మిణీ వసంత్ కీలకపాత్ర చేస్తోంది. కౌశిక్ మహత, కేశవ్ దీపక్, మణికంఠ వారణాసి తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 

 ఈ సినిమాకు సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌, కెమెరా: గిరీష్‌ గంగాధరన్‌, జోమన్ టి జాన్, ఎడిటింగ్: నవీన్ నూలి, యాక్షన్: యానిక్ బెన్, చేతన్ డిసౌజా, రియల్ సతీష్ చేస్తున్నారు.  

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మించారు. 


Related Post

సినిమా స‌మీక్ష