బాలీవుడ్ మిస్టర్ పెర్‌ఫెక్ట్ నటుడు అమీర్ ఖాన్ ఏదయినా ఓ సినిమా తేయాలంటే ముందుగా దాని కధ సిద్దం చేసుకోవడానికే చాలా సమయం తీసుకుంటారు. ఆ తర్వాతే మిగిలిన పనులు మొదలు పెడతారు. ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ, “నా జీవిత లక్ష్యం భారతీయులు అందరూ గర్వపడేలా ‘మహా భారత్’ సినిమా తీయడం. అది మన భారతదేశం గొప్పదనాన్ని యావత్ ప్రపంచదేశాలు గుర్తించేలా ఉండాలని కోరుకుంటున్నాను.
మహా భారత్‌ని కేవలం రెండున్నర గంటలలో చూపించాలంటే చాలా కష్టం కనుక కొన్ని భాగాలుగా తీయాలని అనుకుంటున్నాను. దానిలో అనేక మంది దర్శకులు పనిచేస్తారు. నేను కూడా ఈ సినిమాలో నటిస్తానో లేదో ఇప్పుడే చెప్పలేను.
ఇంత విస్తృతమైన సబ్జెక్ట్ ఉన్న ఈ సినిమాకు కధ సిద్దం చేసుకోవడానికే అనేక ఏళ్ళు పడుతుంది. అలాగని కధ వ్రాసుకుంటూ కూర్చుంటే నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఎన్నటికీ పూర్తి చేయలేను. కనుక ఈ ఏడాదిలోనే మహా భారత్ పనులు ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను,” అని అమీర్ ఖాన్ అన్నారు.