శ్రీవిష్ణుకి సిరాకైంది సింగిల్ బతుకు

April 19, 2025


img

శ్రీవిష్ణు స్వాగ్‌ తర్వాత ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్నాడు. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో ‘మృత్యుంజయ్‌’, కార్తీక రాజు దర్శకత్వంలో #సింగిల్ సినిమాలు చేస్తున్నాడు. 

వీటిలో #సింగిల్ నుంచి ‘సిరాకైంది సింగిల్ బతుకు..’ అంటూ సాగే హుషారుగా సాగే పాట విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి వ్రాసిన ఈ పాటకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించగా రాహుల్ సిప్లీగంజ్ అద్భుతంగా పాడారు. ఈ పాటకు శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్ బృందం చేసిన డాన్స్ కూడా అందరినీ అలరిస్తోంది.       

#సింగిల్ టైటిల్‌తోనే కధేమిటో దర్శకుడు కార్తీక్‌ రాజు చెప్పేశారు. ఇటువంటి కధతోనే సప్తగిరి  ‘పెళ్ళికాని ప్రసాద్’ సినిమా చేసి జనాలను నవ్వించే ప్రయత్నంలో తానే నవ్వులపాలయ్యాడు. కనుక శ్రీవిష్ణు #సింగిల్ ప్రయత్నం ఆవిదంగా ఉండదనే ఆశిద్దాం. 

ఈ సినిమాలో కేతిక శర్మ, ఇవాన, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలు చేశారు. ఈ సినిమాకి కధ, దర్శకత్వం: కార్తీక రాజు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: ఆర్‌. వేల్ రాజ్, డైలాగ్స్: భాను భోగవరపు, నందు సవిరిగన, ఆర్ట్: చంద్రిక గొర్రిపాటి, ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్ చేశారు. 

గీతా ఆర్ట్స్, కాల్య ఫిలిమ్స్ బ్యానర్లపై విద్యా కొప్పయినీది, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి కలిసి నిర్మించిన ఈ #సింగిల్ మే నెలలో విడుదల కాబోతోంది. 

     


Related Post

సినిమా స‌మీక్ష