అనంతపురంలో డాకూ మహరాజ్ ప్రీ రిలీజ్

January 08, 2025


img

సినీ పరిశ్రమ పట్ల తెలంగాణ ప్రభుత్వం కటువుగా వ్యవహరిస్తుండటంతో పెద్ద సినిమాలో వేడుకలు ఏపీకి తరలిపోతున్నాయి. చాలా భారీ అంచనాలతో జనవరి 10న విడుదల కాబోతున్న గేమ్ చేంజర్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ రాజమండ్రికి తరలిపోగా ఇప్పుడు బాలకృష్ణ హీరోగా జనవరి 12న వస్తున్న డాకూ మహరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కూడా ఆనంతపురానికి తరలిపోయింది.

రేపు (గురువారం) సాయంత్రం అనంతపురం పట్టణంలో అయ్యప్ప స్వామి గుడికి సమీపంలో గల శ్రీనగర్‌ కాలనీలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరుగబోతోంది. 

గేమ్ చేంజర్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ ముఖ్య అతిధిగా పాల్గొనగా, డాకూ మహరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఏపీ విద్యాశాఖ మంత్రి, స్వయాన్న బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్‌ ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. 

డాకూ మహరాజ్ సినిమాలో శ్రద్ద శ్రీనాధ్, ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. బాబీ డియోల్, సచిన్ ఖేడెకర్, హిమజ, హర్ష వర్ధన్, చాందినీ చౌదరీ, రీషమా నానయ్య తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. ఊర్వశీ రౌతేలా బాలయ్య బాబుతో కలిసి దిబిడీ దిబిడీ అంటూ స్పెషల్ సాంగ్‌ చేశారు.  

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: బాబీ కొల్లి, స్క్రీన్ ప్లే: కె.చక్రవర్తి రెడ్డి, డైలాగ్స్: భాను, నందు: సంగీతం: తమన్, కెమెరా: విజయ్‌ కార్తీక్ కణ్ణన్, ఎడిటింగ్: నిరంజన్ దేవరమనే, స్టంట్స్‌: వి వెంకట్ చేశారు.   

ఈ సినిమాను శ్రీకార స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్, బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మించారు. 


Related Post

సినిమా స‌మీక్ష