ఈ ఏడాది ఖైరతాబాద్ గణేష్ విగ్రహ నమూనా విడుదల

June 26, 2026


img

ఈ ఏడాది వినాయక చవితి పండుగ సెప్టెంబర్‌ 14న పడింది. కనుక ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు విగ్రహం నిర్మాణానికి ఆనవాయితీ ప్రకారం గురువారం (నిర్మల ఏకాదశి) కర్రపూజ కార్యక్రమం నిర్వహించారు. ఉత్సవ కమిటీ గణేష్ విగ్రహం చిత్ర పటాన్ని నిన్న మీడియాకు విడుదల చేసింది. ఈ ఏడాది పంచముఖ సంకటహర మహాగణపతి రూపంలో ఖైరతాబాద్ గణేశుడు కొలువు తీరనున్నాడు.

ఈ ఏడాది 69 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పుతో గణేష్ విగ్రహం ఏర్పాటు చేయబోతున్నట్లు ఉస్తవ కమిటీ సభ్యులు తెలిపారు. బంగారు పద్మంపై నిలబడిన గణేశునికి 5 తలలు, 8 చేతులు ఉన్నాయి. విగ్రహానికి కుడివైపు సోమనాథ్ జ్యోతిర్లింగం, ఎడమ వైపున కాళీమాత విగ్రహం ఏర్పాటుచేయబోతున్నారు. 

కర్ర పూజ పూర్తయింది కనుక నేటి నుంచి విగ్రహ నిర్మాణానికి అవసరమైన మట్టి వగైరా సమకూర్చుకొని త్వరలో పని మొదలుపెడతారు. 

నిన్న జరిగిన కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ నాగేందర్, రాజ్యసభ సభ్యుడు అనిల్ రావిపూడి కుమార్‌ యాదవ్ తదితరులు హాజరయ్యారు.


Related Post