అవును. మన హైదరాబాద్ నగరంలోనే... ఒక రోడ్డుకి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేరిట నామకరణం చేశారు. హైదరాబాద్‌లోని అమెరికన్ కన్స్యులేట్ కార్యాలయం వద్ద గల రోడ్డుకి డోనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని నామకరణం చేశారు. అమెరికాకి స్వాతంత్ర్యం వచ్చి 250 సం.లు పూర్తయిన సందర్భంగా అమెరికన్ కన్స్యులేట్ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో డెప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, భారత్‌లో అమెరికా రాయబారిసెరిగో గోర్ తదితరులు పాల్గొన్నారు.
మన దేశంలో రాజకీయ పార్టీలు, నాయకులకు తమతమ రాజకీయ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయడం, రోడ్లకు వారి పేర్లు పెట్టడం పరిపాటి. అమెరికన్లకు కూడా ఈ అలవాటు ఉందని దీంతో నిరూపించారు. మన దేశంలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారగానే విగ్రహాలు, పేర్లు మార్చడం కూడా పరిపాటిగా మారింది కనుక రేపు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయాక హైదరాబాద్‌లో ఈ రోడ్డు పేరు కూడా మార్చుతారేమో? అయినా భారత్‌తో సహా యావత్ ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేస్తున్న డోనాల్డ్ ట్రంప్ పేరు పెట్టడం ఏమిటో?