పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్

April 29, 2026


img

నేడు తెలంగాణ పదో తరగతి ఫలితాలు వెలువడిన తర్వాత వాటిలో ఫెయిల్ అయిన, తక్కువ మార్కులు వచ్చినందున బెటర్ మెంట్ కోసం పరీక్షలు వ్రాయాలనుకున్న విద్యార్ధుల కోసం విద్యాశాఖ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. 

జూన్‌ 5 నుంచి 12 వరకు ప్రతీరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. 

జూన్‌ 5న ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్-ఏ), జూన్‌ 6న సెకండ్ లాంగ్వేజ్, జూన్‌ 7న థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్), జూన్‌ 8న గణితం, జూన్‌ 9న   సైన్స్ పార్ట్-1 (ఫిజికల్ సైన్స్), జూన్‌ 10న సైన్స్ పార్ట్-2 (బయలాజికల్ సైన్స్), జూన్‌ 11న సోషల్ మీడియాలో స్టడీస్, ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1, జూన్‌ 12న ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షలు జరుగుతాయి. 



Related Post