దావోస్ సదస్సులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. అందరి లక్ష్యం ఒక్కటే పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలు సాధించడమే.
అయితే సిఎం రేవంత్ రెడ్డి బృందంలో ప్రముఖ సినీ నటుడు చిరంజీవి కూడా ఉండటం విశేషం. తెలంగాణలో సినీ పరిశ్రమని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలని సిఎం రేవంత్ రెడ్డి కోరుకుంటున్న సంగతి తెలిసిందే.
కనుక సినీ రంగంలో కూడా అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించాలనే ఉద్దేశ్యంతోనే ఈ రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులున్న చిరంజీవిని వెంటపెట్టుకొని వెళ్ళి ఉండవచ్చు. ఒకవేళ ఈ ఆలోచన ఫలిస్తే హాలీవుడ్‌తో సహా వివిధ దేశాలకు చెందిన సినీ సంస్థలు హైదరాబాద్‌లో స్టూడియోలు పెట్టే అవకాశం ఉంటుంది.