ఇదేం పని టీనా శ్రావ్యా?

January 21, 2026


img

కమిటీ కుర్రోళ్ళు, ద గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో సినిమాలలో హీరోయిన్‌గా చేసిన టీనా శ్రావ్య మేడారంలో వనదేవతలని దర్శించుకున్నారు. భక్తులు వనదేవతలకు తమ బరువుకి సరిపడా ‘బంగారం’ (బెల్లం) సమర్పించుకోవడం ఆనవాయితీ. ఆమె కూడా అలాగే చెల్లించారు కానీ తన బరువుతో తన పెంపుడు కుక్కని అక్కడి కాటాలో కూర్చోబెట్టి దాని బరువుకి సరిపడా బెల్లం వనదేవతలకు సమర్పించారు.

అక్కడ ఉన్న సిబ్బంది కూడా ఆమెను వారించలేదు. అయితే అక్కడే ఉన్న భక్తులు అభ్యంతరం చెప్పారు. కొందరు తమ మొబైల్ ఫోన్లతో ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. సోషల్ మీడియాలో కూడా కొందరు ఆమెను తీవ్రంగా విమర్శిస్తుండగా కొందరు ఆమె జంతుప్రేమను ప్రశంశిస్తున్నారు. కానీ పెంపుడు జంతువుల ప్రేమ ఉంటే వాటిని ప్రేమగా చూసుకోవచ్చు. కానీ ఈవిధంగా భక్తుల మనోభావాలు దెబ్బ తినేవిధంగా చేయడం సరికాదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది వివాదాస్పదం అవుతుండటంతో ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి ఆ ఫోటోని, వీడియోని తొలగించేశారు. 


Related Post