ట్రాఫిక్ పెండింగ్ చలాన్లపై హైకోర్టు ఏమందంటే..

January 21, 2026


img

ఇటీవల సిఎం రేవంత్ రెడ్డి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, “ఎవరైనా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే వారిపై ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేస్తుంటారు. వాటిని వసూలు చేసుకునేందుకు తిప్పలు పడుతుంటారు. దీని బదులు చలాన్ పడగానే వారి బ్యాంక్ ఖాతాలో నుంచి డబ్బు కట్ అయిపోయే విధానం ఏర్పాటు చేసుకుంటే మంచిది,” అని అన్నారు.   

కనుక హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్ పెండింగ్ చలాన్లు 5 కంటే ఎక్కువ ఉంటే తగు చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీస్ విభాగం నిర్ణయించింది. కానీ దీనిపై విజయ్‌ గోపాల్ అనే న్యాయవాది అభ్యంతరం చెపుతూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. 

ట్రాఫిక్ పోలీసులు పెండింగ్ చలాన్ల వసూలు పేరుతో ట్రాఫిక్ పోలీసులు ప్రజలను వేదిస్తున్నారని, ఇలా చేయడం చట్ట విరుద్దమని వాదించారు. 

ఆయన వాదనలతో హైకోర్టు ఏకీభవిస్తూ, ట్రాఫిక్ పోలీసులు వాహనాలు ఆపి పెండింగ్ చలాన్ల గురించి అడగవచ్చు కానీ బెదిరించడం, వాహనాల తాళం చెవి తీసేసుకోవడం, వాహనాలని సీజ్ చేయడం వంటివి చేయరాదని ఆదేశించింది. ఎవరైనా స్వచ్చందంగా పెండింగ్ చలాన్లు కడితే కట్టించుకోవచ్చని స్పష్టం చేసింది. 


Related Post