జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నవంబర్‌లో?

July 04, 2025


img

బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ ఆకస్మిక మృతితో జూబ్లీహిల్స్‌ శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. రాజ్యాంగం ప్రకారం ఓ ఎంపీ లేదా ఎమ్మెల్యే సీటు ఏ కారణంగానైనా ఖాళీ అయితే 6 నెలలోగా ఉప ఎన్నిక నిర్వహించి ఆ ఖాళీ భర్తీ చేయాల్సి ఉంటుంది.

గోపీనాధ్ మృతితో జూన్ నెలలో చనిపోవడంతో ఆ సీటు ఖాళీ అయ్యింది కనుక డిసెంబర్‌లోగా ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ఏడాది నవంబర్‌లో బిహార్‌ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక అప్పుడే జూబ్లీహిల్స్‌ తో పాటు దేశంలో ఇతర రాష్ట్రాలలో ఈవిదంగా ఖాళీ అయిన స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది. 

ఇదివరకు అక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన మహమ్మద్ అజారుద్దీన్ మళ్ళీ అక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. కానీ కాంగ్రెస్‌ అధిష్టానం ఎవరి పేరు ఖరారు చేస్తుందో తెలియదు. బీజేపి, బిఆర్ఎస్ పార్టీలు కూడా ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు.


Related Post