ఎన్నికలలో తొలిసారిగా పోటీ చేసిన ప్రియాంక గాంధీ తమ్ముడు రాహుల్ గాంధీ రికార్డుని బ్రేక్ చేశారు. రాహుల్ గాంధీ కేరళలో వయనాడ్, యూపీలోని రాయ్ బరేలీ రెండు చోట్ల పోటీ చేసి గెలవడంతో వయనాడ్ సీటుని వదులుకున్నారు. అక్కడి నుంచి తొలిసారిగా లోక్ సభకు పోటీ చేసిన ప్రియాంక గాంధీ తన సమీప ప్రత్యర్ధిపై ఏకంగా 4.04 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
అదే.. 2024 ఎన్నికలలో రాహుల్ పోటీ చేసినప్పుడు ఆయనకు 3.60 లక్షల మెజార్టీ వచ్చింది. ప్రియాంకకు రాజకీయాలు కొత్త కానప్పటికీ తొలి ప్రయత్నంలోనే ఇంత భారీ మెజార్టీతో విజయం సాధించి తొలిసారిగా లోక్ సభలో అడుగు పెట్టబోతున్నారు.
దీంతో గాంధీ కుటుంబంలో వారసులు ఇద్దరూ కూడా ఎంపీలు అయ్యారు. వారి తల్లి సోనియా గాంధీ ఇదివరకే ఎంపీ అయ్యారు. ఇంకా ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా కూడా ఎంపీగా పోటీ చేసి గెలిచేస్తే కుటుంబంలో అందరూ ఎంపీలు అయిపోతారు. ఇంత వరకు తల్లీ కొడుకులు అంటే సోనియాగాంధీ, రాహుల్ గాంధీ లోక్ సభలో ఉండేవారు. ఇప్పుడు అక్క తమ్ముడు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలు కనిపించబోతున్నారు.