మూసీ ఒడ్డున గాంధీ విగ్రహం పెడతాం: రేవంత్‌

October 26, 2024


img

సిఎం రేవంత్‌ రెడ్డి ఇటీవల మూసీ ప్రక్షాళనపై ఎక్కువ దృష్టి పెడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, “ప్రధాని నరేంద్రమోడీ తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో నర్మదా నదిని ప్రక్షాళనం చేసుకోవచ్చు కానీ మేము మూసీ నదిని ప్రక్షాళన చేసుకోకూడదా? 

ప్రధాని నరేంద్రమోడీ నర్మదానది మద్యన ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ పేరుతో 192 మీటర్ల ఎత్తైన సర్దార్ పటేల్ విగ్రహం ఏర్పాటుచేసుకున్నారు. మా ప్రభుత్వం మూసీ ఒడ్డున అంత కంటే ఎత్తైన మహాత్మ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తుంది,” అని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. 

 ఈ సందర్భంగా సిఎం రేవంత్‌ రెడ్డి కేంద్ర ప్రభుత్వం తీరుని విమర్శిస్తూ, “తెలంగాణ పట్ల చాలా వివక్షతో వ్యవహరిస్తోంది. కేంద్రానికి తెలంగాణతో సహా దక్షిణాది రాష్ట్రాల నుంచే పన్నుల రూపంలో భారీగా ఆదాయం లభిస్తుంది. కానీ వాటిలో తిరిగి ఇచ్చేది చాలా తక్కువ. అదే ఉత్తరాది రాష్ట్రాలలో యూపీ, బిహార్‌ నుంచి వచ్చేది చాలా తక్కువ ఇచ్చేది చాలా ఎక్కువ. బిజేపీ అధిష్టానానికి ఉత్తరాది రాష్ట్రాలపై ఉన్న శ్రద్ద ప్రేమ దక్షిణాది రాష్ట్రాలపై లేదు,” అని అన్నారు. 


Related Post