మాజీ గవర్నర్ తమిళసై... చెన్నై నుంచి ఎంపీగా పోటీ

March 26, 2024


img

తెలంగాణ, పుదుచ్చేరి మాజీ గవర్నర్‌ తమిళ సై లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసేందుకు తన పదవులకు రాజీనామా చేసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆమెకు బీజేపీ అధిష్టానం చెన్నై (సౌత్) టికెట్‌ ఇచ్చింది. 

ఈ విషయం ఆమె స్వయంగా మీడియాకు తెలియజేస్తూ, “చెన్నై నగరం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం చాలా సాయపడింది. ఇంకా చేయవలసింది చాలా ఉంది. కనుక నా వంటివారు ప్రజాప్రతినిధిగా ఉంటే మరింత సులువుగా చెన్నై అభివృద్ధికి తోడ్పడవచ్చని, కనుక నన్ను చెన్నై (సౌత్) నుంచి లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయవలసిందిగా ప్రధాని నరేంద్రమోడీ కోరారు. 

నేను కూడా రాష్ట్ర, దేశాభివృద్ధిలో భాగస్వామిని కావాలనుకొంటున్నాను కనుక నా గవర్నర్‌ పదవులకు రాజీనామా చేసి లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసేందుకు మళ్ళీ బీజేపీలో చేరాను. ఈసారి మా ఎన్డీయే కూటమి కనీసం 400 సీట్ల మెజార్టీతో గెలిచి కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నాను. అలాగే తమిళనాడులో కూడా మేము పోటీ చేయబోతున్నవాటిలో అత్యధిక స్థానాలు గెలుచుకొంటామని నాకు పూర్తి నమ్మకం ఉంది,” అని అన్నారు. 


Related Post