ఉపాధ్యాయురాలిని చెప్పుతో కొట్టిన విద్యార్ధిని!

April 22, 2025
img

కొన్నిసార్లు విద్యార్ధులను లైంగికంగా వేధించిన ఉపాధ్యాయులకు బడిత పూజ చేశారనే వార్తలు చూస్తుంటాము. కానీ కళాశాలలో మొబైల్ ఫోన్‌ కబుర్లు వద్దంటూ ఫోన్‌ తీసుకునందుకు ఓ విద్యార్ధిని తన ఉపాధ్యాయురాలిని బూతులు తిడుతూ ఆమెపై చెప్పుతో దాడి చేసింది. ఈ అనూహ్య ఘటన విశాఖ జిల్లా భీముని పట్నంలో ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగింది.

అది చూసి సాటి విద్యార్ధులు, సమీపంలోనే ఉన్న ఉపాధ్యాయులు అవాక్కయ్యారు. కానీ వెంటనే ఆమెను అడ్డుకొని మందలించారు.

తన తల్లితండ్రులు రూ.12,000 పెట్టి ఆ మొబిల్ ఫోన్‌ తనకు పుట్టిన రోజు బహుమతిగా ఇచ్చారని, దానిని ఉపాధ్యాయురాలు తన చేతిలో నుంచి బలవంతంగా గుంజుకోవడంతో ఆవేశంతో దాడి చేశానే తప్ప ఆమె అంటే తనకు గౌరవమే అని ఆ విద్యార్ధిని చెప్పిన్నట్లు సమాచారం.

కానీ ఉపాధ్యాయురాలిని నలుగురిలో బూతులు తిడుతూ చెప్పుతో కొట్టి అవమానించినందుకు ఆమెను కొన్ని రోజుల పాటు కాలేజీ నుంచి సస్పెండ్ చేసిన్నట్లు సమాచారం.

Related Post