గురుకుల పోస్టుల పరీక్షల షెడ్యూల్ జారీ

June 16, 2024
img

తెలంగాణలో ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో టీజీపీఎస్‌ఎస్సీ నేడు గురుకుల పోస్టుల పరీక్షల షెడ్యూల్ జారీ చేసింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా శిశు సంక్షేమశాఖల పరిధిలో గల గురుకుల వసతి గృహాలలో మొత్తం 581 పోస్టులకు భర్తీకి ఈ నెల 24 నుంచి 29వరకు పరీక్షలు నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. రోజుకి రెండు సెషన్స్ చొప్పున కంప్యూటర్ ఆధారిత (సిఆర్‌బీటి) విధానంలో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ నెల 21 నుంచి ఆన్‌లైన్‌లో పరీక్షలకు హాల్ టికెట్స్ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

ఈ పోస్టులకు గత ప్రభుత్వం హయంలో అంటే 2022 డిసెంబర్‌లో నోటిఫికేషన్‌ వెలువడింది. అప్పటి నుంచి వివిద కారణాలతో వాయిదా పడుతూ చివరికి రెండున్నర ఏళ్ళ తర్వాత ఇప్పుడు పరీక్షలు జరుగబోతున్నాయి. 

ఈ పరీక్షల ద్వారా భర్తీ చేయబోయే పోస్టుల వివరాలు: 

గిరిజన సంక్షేమ హాస్టల్ : గ్రేడ్ 1 ఆఫీసర్- 5 పోస్టులు, 

ఎస్సీ సంక్షేమ హాస్టల్ : గ్రేడ్ 2 మహిళా ఆఫీసర్- 70 పోస్టులు, గ్రేడ్-2 పురుష ఆఫీసర్- 228 పోస్టులు, 

బీసీ సంక్షేమ హాస్టల్  వార్డెన్స్: గ్రేడ్-2-140 పోస్టులు,

దివ్యాంగుల సంక్షేమ హాస్టల్ వార్డెన్: గ్రేడ్-5 పోస్టులు, వార్డెన్ గ్రేడ్ 2-2 పోస్టులు,

చిన్నారుల సంరక్షణ గృహాలు మహిళా సూపరింటెండెంట్‌: 19 పోస్టులు.

ఈ పోస్టుల భర్తీకి సంబందించి పరీక్షల షెడ్యూల్ ఈవిదంగా ఉంటుంది:  


Related Post