గ్రూప్-1 పంచాయితీ: హైకోర్టు డివిజన్ బెంచ్‌కి!

September 12, 2025


img

గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు సింగిల్ జడ్జ్ జస్టిస్ నామవరపు రాజేశ్వర రావు ఇచ్చిన తీర్పుని హైకోర్టు డివిజన్ బెంచ్‌లో సవాలు చేయాలని టిజీపీఎస్సీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.  

సింగిల్ జడ్జ్ తీర్పు: సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం మళ్ళీ మూల్యాంకనం జరపాలని, ఈ భర్తీ ప్రక్రియని 8 నెలల్లోగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఒకవేళ ఈ ప్రక్రియ నిర్దిష్ట గడువులోగా పూర్తిచేయకపోతే మెయిన్ పరీక్షలని రద్దు చేయవలసి వస్తుందని కూడా హెచ్చరించారు. 

ఈ తీర్పు ప్రకారం ముందుకు సాగితే గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మళ్ళీ మొదటికొస్తుంది. దీని వలన పోటీ పరీక్షలలో అర్హత సాధించిన అభ్యర్ధులకు అన్యాయం జరుగుతుంది. కనుక ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేసి, ఆయన అనుమతితో సింగిల్ జడ్జ్ తీర్పుని డివిజన్ బెంచ్‌లో సవాలు చేయాలని టిజీపీఎస్సీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.


Related Post