కేంద్ర బడ్జెట్‌ ప్రధానాంశాలు

February 01, 2020


img

ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ 2020-21 ఆర్ధిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు. ప్రస్తుతం ఆమె బడ్జెట్‌లో ప్రధానాంశాలను వివరిస్తున్నారు. ఒకే దేశం... ఒకే పన్ను విధానం అమలులోకి తెచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా 60 లక్షలమంది కొత్తగా పన్ను చెల్లింపుదారులు చేరారని, వారి నుంచి సుమారు రూ.40 కోట్లు జీఎస్టీ వసూలు అయ్యిందని తెలిపారు. జీఎస్టీ ద్వారా కేంద్రానికి లభిస్తున్న అదనపు ఆదాయంలో సుమారు లక్ష కోట్ల వరకు దేశంలో సామాన్యప్రజల కోసం వినియోగిస్తున్నామని తెలిపారు. జీఎస్టీ విధానం అమలులోకి వచ్చినప్పటి నుంచి సామాన్యులపై పన్నుభారం తగ్గిందని ఆమె తెలిపారు. 

ఇప్పటివరకు ఆమె ప్రకటించిన బడ్జెట్‌లో ప్రధానాంశాలు... 

విద్యా రంగం: 

విద్యారంగానికి రూ 99, 300 కోట్లు

ఇకపై విద్యారంగంలో విదేశీపెట్టుబడులకు అనుమతి

భవిష్యత్‌ అవసరాలకు తగినట్లుగా విద్యార్దులలో ప్రత్యేక నైపుణ్యాలు అభివృద్ధి కోసం 2026నాటికి 150 యూనివర్సిటీలలో కొత్త కోర్సులు ప్రవేశపెడతాం. 

అన్ని ప్రధాన యూనివర్సిటీలలో ఆన్‌లైన్‌ డిగ్రీకోర్సులు ప్రవేశపెడతాం. 

నేషనల్ పోలీస్, ఫోరెన్సిక్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. 

వైద్యరంగం: 

ఆరోగ్య రంగానికి రూ 69,000 కోట్లు కేటాయింపు

ప్రతీ జిల్లా ఆసుపత్రికి అనుబంధంగా ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేస్తాం. 

వ్యవసాయ, మహిళా, గ్రామీణాభివృద్ధి: 

వ్యవసాయ రుణాలకు రూ 15 లక్షల కోట్లు కేటాయింపు

వ్యవసాయ, గ్రామీణాభివృద్ధికి రూ. 2.83 లక్షల కోట్లు 

పైప్‌డ్‌ వాటర్‌ ప్రాజెక్టుకు రూ 3.6 లక్షల కోట్లు

పంచాయితీరాజ్‌కు రూ 1.23 లక్షల కోట్లు

స్వచ్ఛభారత్‌ మిషన్‌కు రూ 12,300 కోట్లు

జల్‌జీవన్‌ మిషన్‌కు రూ 11,500 కోట్లు

గ్రామీణ మహిళలకు ధాన్యలక్ష్మి పేరుతో నూతన స్కీం

ముద్ర స్కీమ్‌ ద్వారా గ్రామీణ మహిళలకు సాయం

నాబార్డు ద్వారా రీఫైనాన్స్‌ పునరుద్ధరణ

పరిశ్రమలు, మౌలిక వసతులు, రవాణా: 

పరిశ్రమలు, వాణిజ్య రంగానికి రూ 27,300 కోట్లు

రవాణా మౌలిక సదుపాయాలకు రూ 1.7 లక్షల కోట్లు

నేషనల్‌ టెక్నికల్‌ టెక్స్‌టైల్‌ మిషన్‌ ఏర్పాటుకు రూ1,480 కోట్లు

త్వరలో జాతీయ లాజిస్టిక్స్‌ పాలసీ

యువ పారిశ్రామికవేత్తల ప్రోత్సాహానికి ప్రత్యేక పథకం

చిన్న ఎగుమతిదారుల కోసం నిర్విక్‌ పథకం

ఇండస్ట్రియల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సెల్‌ ఏర్పాటు

ల్యాండ్‌ బ్యాంక్‌, ఇతర ప్రభుత్వ అనుమతుల కోసం ప్రత్యేక సెల్‌

2023 నాటికి ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌ వే పూర్తి

పెద్దసంఖ్యలో తేజాస్‌ తరహా రైళ్లు, సెమీ హైస్పీడ్‌ రైళ్లు

కొత్తగా ఐదు స్మార్ట్‌ సిటీల అభివృద్ధి


Related Post