కాంగ్రెస్ పార్టీలో నేతలే నిర్ణయించుకొంటారా?

March 31, 2018


img

ఏ పార్టీలో అయినా నేతలు ఎన్నికలలో టికెట్ ఆశించడం సహజం. దాని కోసం వారు ప్రయత్నాలు చేసుకోవడం కూడ సహజమే. అయితే కూడికలు, తీసివేతల లెక్కలు సరిచూసుకొన్న తరువాత ఎవరికి ఎక్కడ టికెట్స్ కేటాయించాలనే విషయం పార్టీ అధిష్టానాలు నిర్ణయిస్తుంటాయి. కానీ తెలంగాణా కాంగ్రెస్ లో మాత్రం నేతలే తాము ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నామో ప్రకటిస్తుండటం విశేషం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను వచ్చే ఎన్నికలలో నల్గొండ నుంచి లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించారు. రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి వచ్చే ఎన్నికలలో తాను ఖమ్మం నుంచి లోక్ సభకు పోటీ చేస్తానని నిన్న ప్రకటించారు. తెదేపా నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయనకు మత్కల్ శాసనసభ సీటు ఇస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి ప్రకటించారు.

వచ్చే ఎన్నికలలో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని రాహుల్ గాంధీ సూచిస్తుంటే టి-కాంగ్రెస్ లో నేతలు పార్టీ ప్రమేయం లేకుండానే ఎవరికివారు టికెట్స్ కేటాయించేసుకోవడం విచిత్రంగానే ఉంది కదా?   



Related Post