రాజకీయాలలో రాహుల్ కొత్త ఒరవడి

February 14, 2018


img

కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 28, 1885న ఆవిర్భవించింది. అంటే దాని వయసు 132 సంవత్సరాలన్న మాట. ఇన్ని దశాబ్దాలలో ఆ పార్టీ పగ్గాలు చేపట్టిన అనేకమంది నాయకులు దానిని యావత్ దేశ ప్రజలకు చేరువ చేయగలిగారు. రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు స్వీకరించిన మూడు నెలలోనే పార్టీపై తన ముద్ర వేయగలిగారు. దేశంలోకెల్లా అతి పురాతనమైన పార్టీని, అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక టెక్నాలజీతో అనుసంధానం చేసి మళ్ళీ పూర్వ వైభవం సాధించడానికి ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు. వాటిలో బాగంగానే పార్టీలో ‘డేటా అనలిటిక్స్’ అనే విభాగాన్ని ఏర్పాటు చేశారు. దానికి ఆ రంగంలో గొప్ప నిపుణుడు, అనుభవజ్ఞుడని పేరొందిన ప్రవీణ్ చక్రవర్తిని చైర్మన్ గా నియమించారు. 

ఇంతకాలం రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా పార్టీ టికెట్ల కేటాయింపులు, పిసిసి పదవులు కేటాయింపబడేవి. అలాగే వారి ఫీడ్ బ్యాక్ ఆధారంగానే రాష్ట్ర రాజకీయాలపై నిర్ణయాలు తీసుకోబడేవి. కాంగ్రెస్ అధిష్టానానికి కలిసే అవకాశమున్న కొంతమంది నేతల మాటలను బట్టి పదవులు, టికెట్స్ కేటాయించడం, రాజకీయ నిర్ణయాలు తీసుకోబడేవి. ముఠా సంస్కృతి ఎక్కువగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో కొందరు వ్యక్తుల మాటలను నమ్ముకొని రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం వలన పార్టీ చాలా నష్టపోతోందని భావించిన రాహుల్ గాంధీ, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు సేకరించి. వాటిని విశ్లేషించడానికి ఈ డేటా అనలిటిక్స్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. 

దాని ప్రతినిధులు రాష్ట్రాలలో కాంగ్రెస్ నేతలతో సంబంధం పెట్టుకోకుండా నేరుగా క్షేత్రస్థాయిలో ప్రజలను, కార్యకర్తలను కలుస్తూ పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధుల పనితీరు గురించి, అలాగే వివిధ అంశాలు, స్థానిక సమస్యల గురించి ఎప్పటికప్పుడు సర్వే చేసి తెలుసుకొంటారు. వారు సేకరించిన ఆ సమాచారాన్ని డిల్లీలో ఏర్పాటు చేసిన డేటా అనలిటిక్స్ నిపుణులు విశ్లేషించి నివేదికలు రూపొందించి రాహుల్ గాంధీకి అందజేస్తారు. గుజరాత్ ఎన్నికల సమయంలో చేసిన ఈ ప్రయోగం మంచి ఫలితాలు సాధించడంతో తెలంగాణాతో సహా దేశంలో అన్ని రాష్ట్రాలకు దీనిని విస్తరించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.


Related Post