గత ఏడాది సిఎం రేవంత్ రెడ్డి బృందం దక్షిణ కొరియాలో పర్యటించినప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కార్లు తయారీ కంపెనీ హ్యూండాయ్‌తో ఒప్పందం జరిగింది. అదిప్పుడు కార్య రూపం దాల్చబోతోంది.
రూ.8,528 కోట్ల పెట్టుబడితో జహీరాబాద్‌లో 675 ఎకరాల విస్తీర్ణంలో కార్లు తయారు చేసే ప్లాంట్‌లో ఏర్పాటు చేయబోతోంది. దీంతో బాటు గ్లోబల్ రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్, తయారైన కార్లు టెస్టింగ్ కోసం ఓ టెస్టింగ్ యూనిట్ కూడా ఏర్పాటు చేయబోతోంది.
ఈ ప్లాంట్‌లో ప్రత్యక్షంగా 4,200 మందికి ఉద్యోగాలు, పరోక్షంగా మరికొన్ని వేలమందికి ఉపాధి లభించనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హ్యూండాయ్ కార్ల విక్రయాలు జోరుగా సాగుతున్నందున భవిష్యత్‌లో ఈ ప్లాంట్ విస్తరణ జరిగే అవకాశం కూడా ఉంటుంది.
కనుక 10 వ తరగతి ఉత్తీర్ణులై ఇంటర్, ఐటిఐ, ఇంజనీరింగ్ చదువబోతున్న విద్యార్ధులు, ఇప్పటికే ఈ చదువులు పూర్తిచేసినా వారు ఈ రంగంలో నైపుణ్యం, అర్హతలు పెంచుకుంటే సులువుగా ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు.