మంచిర్యాల ప్రజలు ఈ శుభవార్త కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. చెన్నై నుంచి సికింద్రాబాద్ మీదుగా తిరిగే రెండు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు ఇక నుంచి మంచిర్యాల స్టేషన్‌లో ఆగనున్నాయి. ఈ మేరకు దక్షిణ మద్య రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
దాని ప్రకారం (ట్రైన్ నంబర్: 06157) డా.ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-భగత్ కి కోఠి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (వారానికి ఒక్క రోజు) ఉదయం 6.14 గంటలకు మంచిర్యాల స్టేషన్ చేరుకుంటుంది. మళ్ళీ 6.15 గంటలకు బయలుదేరుతుంది.
ఆదేవిదంగా ఈ నెల 31 నుంచి (ట్రైన్ నంబర్: 06158) భగత్ కి కోఠి- డా.ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 10.34 గంటలకు మంచిర్యాల చేరుకొని మళ్ళీ 10.35 గంటలకు బయలుదేరుతుంది.
ఈ రైళ్ళు చెన్నై-గూడూరు-విజయవాడ-బల్లార్షా-వార్ధా-అకోలా-బుసావల్-జల్గావ్-సూరత్-వడోద్రా-అహ్మదాబాద్-మహిసాన-పటాన్-బిల్డి-ధనేర-రానివార-జాలోర్-మోకాల్సర్ మీదుగా భగత్ కి కోఠి స్టేషన్ చేరుకుని మళ్ళీ ఇవే స్టేషన్ల మీదుగా పాయనిస్తూ మంచిర్యాలలో ఆగి చెన్నై వెళుతుంది.