కాళేశ్వరం టూర్ ప్యాకేజీ గురించి తెలుసా?

May 26, 2023
img

తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత వ్యవసాయ రంగం చాలా వృద్ధి చెందిన్నట్లు అందరికీ తెలుసు. దాంతో పాటే గోదావరి నదీ జలాలు పారే ప్రాంతాలన్నీ పచ్చదనంతో కొత్త శోభ సంతరించుకొని పర్యాటక ఆకర్షణ కేంద్రాలుగా కూడా మార్పు చెందుతున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం అయ్యే మేడిగడ్డ వద్ద నిర్మించిన బారీ బ్యారేజి, నది ఒడ్డునే మహిమాన్వితమైన కాళేశ్వరస్వామివారి ఆలయం, కన్నెపల్లి పంప్ హౌస్‌, రామప్ప వద్ద శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయాలను సందర్శించేందుకు తెలంగాణ పర్యాటక శాఖ ఒక ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌ నగరవాసుల కోసం శని, ఆదివారాలలో మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. 

పెద్దలకు రూ.1,850, 5-12 సంవత్సరల లోపు వయసున్న పిల్లలకు రూ.1,490 చెల్లించాల్సి ఉంటుంది. దీనిలో ఉదయం టీ, టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టీ, రాత్రి భోజనం, హోటల్‌లో వసతి, ఆలయాలలో దర్శనం కలిపి ఈ చార్జీలను నిర్ణయించింది.          

టూర్ ఏవిదంగా అంటే, ప్రతీ శని, ఆదివారాలలో తెల్లవారుజామున 5 గంటలకు సికింద్రాబాద్‌లోని యాత్రి నివాస్ వద్ద నుంచి బస్సులు బయలుదేరి సీఆర్ఓ బషీర్‌బాగ్ మీదుగా ఉదయం 8 గంటలకు వరంగలోని హరిత కాకతీయ హోటల్‌కు చేరుకొంటాయి. అక్కడ టీ, టిఫిన్ తర్వాత రామలింగేశ్వర స్వామి ఆలయ దర్శనం, తర్వాత మేడిగడ్డ బ్యారేజి పర్యటన ఉంటుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు కాళేశ్వరం హోటల్‌లో భోజనాలు చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ 3 గంటలకు కన్నెపల్లి పంప్ హౌస్, సాయంత్రం 4 గంటలకు శ్రీ కాళేశ్వరస్వామి ఆలయదర్శనం చేయించి అక్కడి నుంచి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. రాత్రి 11 గంటలకు సికింద్రాబాద్‌ యాత్రినివాస్ వద్ద ఈ టూర్ ముగుస్తుంది.  

ఈ టూర్ పూర్తి వివరాలు https://tourism.telangana.gov.in/package/KaleshwaramTour వెబ్‌సైట్‌లో లభిస్తాయి. లేదా టోల్‌ప్లాజా ఫ్రీ నంబర్: +91-1800-42546464కి ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చు. 


Related Post