హైదరాబాద్‌లో స్మార్ట్ డాటా సెంటర్‌కు శంఖుస్థాపన

July 03, 2020
img

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి జోరందుకొంది. కేటీఆర్‌ పరిశ్రమలు, ఐ‌టి మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి హైదరాబాద్‌కు మరిన్ని జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, పరిశ్రమలను రప్పించేందుకు చాలా కృషి చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. ఆయన కృషి ఫలించి హైదరాబాద్‌ శివార్లలో నార్సింగి వద్ద రూ.500 కోట్లు పెట్టుబడితో స్మార్ట్ డాటా సెంటర్ ఏర్పాటుకాబోతోంది. కేంద్రం ప్రకటించిన డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోంది. దీనికి మంత్రి కేటీఆర్‌ ఈరోజు ఉదయం శంఖుస్థాపన చేశారు. 


Related Post