జియో ఫీచర్ ఫోన్ లో త్వరలో వాట్స్ అప్?

June 18, 2018
img

జియో ఫీచర్ ఫోన్ లో రూ.49కే 28 రోజులు అపరిమిత కాల్స్ చేసుకునే సౌకర్యం కల్పించడం ద్వారా లక్షలాదిమందిని ఆకర్షించగలిగింది. అయితే అది బేసిక్ మోడల్ ఫోన్ కనుక స్మార్ట్ ఫోన్స్ లో ఉండే ఫీచర్స్ ను ఆశించడం అత్యాశే అవుతుంది. అయినా దానిలో ఫేస్ బుక్, వాట్స్ అప్ వంటి అప్లికేషన్స్ కూడా ఉన్నట్లయితే మరింత బాగుండేదనే వినియోగదారుల అభిప్రాయం మేరకు ఫీచర్ ఫోన్ కోసం ప్రత్యేక సాఫ్ట్ వేర్ రూపొందించి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫేస్ బుక్ సౌకర్యాన్ని కల్పించింది. ఇప్పుడు ఆ సాఫ్ట్ వేర్ ను మరింత మెరుగుపరిచి దానితో వాట్స్ అప్ కూడా పనిచేసేవిధంగా సిద్దం చేస్తున్నారు. అతిత్వరలోనే జియో ఫీచర్ ఫోన్లలో వాట్స్ అప్ కూడా ప్రత్యక్షమయ్యే అవకాశం ఉంది. అయితే ఫేస్ బుక్, వాట్స్ అప్ వినియోగించుకోవాలంటే అదనపు డేటా లభించే ప్లాన్ లోకి అప్ గ్రేడ్ కావలసిఉంటుందని వేరే చెప్పక్కరలేదు. అంటే జియోకు మరింత బిజినెస్ లభిస్తుందన్నమాట!

Related Post