వాట్స్ అప్ లో అన్నీ వాపస్!

April 16, 2018
img

కోట్లాదిమంది భారతీయుల దైనందిన జీవితంలో భాగంగా మారిపోయిన వాట్స్ అప్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు కానీ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ పరిచయం చేస్తూ వాటి గురించి చెప్పుకొనేలా చేస్తోంది. వాట్స్ అప్ తాజాగా రెండు కొత్త ఫీచర్స్ పరిచయం చేస్తోంది. 1.డిలీట్ చేసిన ఫోటోలు, వీడియోలు, ఆడియోలు వగైరా తిరిగి పొందడం. 2. ఇద్దరి మద్య జరిగే ప్రతీ ఛాట్ కు ఒక ప్రత్యేకమైన కోడ్ జనరేట్ చేయడం.

మొదటి ఫీచర్ ద్వారా మనం ఇతరులకు పంపిన ఫోటోలు, వీడియోలు, మెసేజులు లేదా ఇతరులతో చేసిన సంభాషణలను లేదా ఫోన్ లో నుంచి డిలీట్ చేసినవాటిని కావాలనుకొంటే తిరిగిపొందవచ్చు. ఫోన్ లోకి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అవన్నీ 30 రోజులపాటు వాట్స్ అప్ సర్వర్ లో భద్రపరచబడతాయి కనుక ఆలోగా వాటిని తిరిగిపొందవచ్చు. 

ఇక రెండవ ఫీచర్ వ్యక్తిగత సమాచార భద్రతకు సంబంధించినది. ఫేస్ బుక్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతులలోకి వెళ్ళిపోవడంతో ఆ సంస్థ ఎంత అప్రదిష్ట పాలైందో అందరూ చూశారు. బహుశః దానిని దృష్టిలో పెట్టుకొనే వాట్స్ అప్ సంస్థ ఈ సరికొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టినట్లుంది. దీనిలో ఇద్దరు వ్యక్తుల మద్య జరిగే సమాచార మార్పిడి వివరాలను చివరికి వాట్స్ అప్ సంస్థ కూడా చూడలేదు. కేవలం వారిద్దరూ మాత్రమే చూడగలరు. ఈ రెండు ఫీచర్స్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి రాబోతున్నాయి. 

Related Post