మొబైల్స్ కాదు..మిషన్ టు మిషన్ నెంబర్స్ మారుతాయిట!

February 21, 2018
img

ప్రస్తుతం అమలులో ఉన్న 10 అంకెల మొబైల్ స్థానంలో 13 అంకెలను ప్రవేశపెట్టబోతున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలపై టెలికాం శాఖ వివరణ ఇచ్చింది. మొబైల్ నెంబర్స్ లో ఎటువంటి మార్పు ఉండబోదని, నగదు రహిత లావాదేవీలు లేదా ఇంటర్నెట్ ద్వారా అనుసంధానమై పనిచేసే ఒక యంత్రం నుంచి మరొక యంత్రానికి వినియోగించే వాటిలో (మెషిన్ టు మెషిన్) మాత్రమే 13 నెంబర్లకు మారబోతున్నాయని తెలిపింది. ఉదాహరణకు క్రెడిట్, డెబిట్ కార్డు స్వైపింగ్ యంత్రాలు, ఎటిఎంలవంటివి. కనుక మొబైల్ నెంబర్లలో ఎటువంటి మార్పు ఉండబోదని టెలికాం శాఖ స్పష్టం చేసింది.  


Related Post