రాహుల్ గాంధీకి మోడీ శుభాకాంక్షలు

December 11, 2017


img

కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కాంగ్రెస్ ఎన్నికల అధారిటీ చైర్మన్ ఎం.రామచంద్రన్ సోమవారం సాయంత్రం ప్రకటించడంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకొంటున్నాయి. రాహుల్ ఎన్నికపై రెండు విభిన్నమైన స్పందనలు కూడా వచ్చాయి.

ప్రధాని నరేంద్ర మోడీ రాహుల్ గాంధీకి ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. అయన హయంలో కాంగ్రెస్ సత్ఫలితాలు సాధించాలని ఆశిస్తున్నానని మోడీ ట్వీట్ చేశారు. 

ఇక మహారాష్ట్ర కాంగ్రెస్ మాజీ కార్యదర్శి షెహజాద్ పూనావాలా ముంబైలో మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇది చీకటి రోజు. అయన ఏకగ్రీవంగా ఎన్నికవడం కోసం నావంటివారిని నామినేషన్ వేయకుండా కాంగ్రెస్ పెద్దలు అడ్డుకొన్నారు. అటువంటప్పుడు అది ఎన్నిక ఎలా అవుతుంది? రాహుల్ గాంధీ దొడ్డిదారిన పార్టీ పగ్గాలు చేపట్టారు. ఆయన ఎన్నిక అప్రజాస్వామికం, చట్టవిరుద్ధం. కనుక ఆయన ఎన్నిక చెల్లదు. అయన ఎన్నికను సవాలు చేస్తూ నేను న్యాయపోరాటం చేస్తాను,” అని హెచ్చరించారు.    



Related Post